అప్పన్నకు ఎమ్మెల్సీ బుద్దా పూజలు..
Ens Balu
2
Simhachalam
2021-06-17 05:38:58
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ కుటుంబంలో త్వరలో వివాహం జరగబోతోందని, స్వామివారి ఆశీస్సులకోసం దేవాలయానికి వచ్చానని బుద్ధాతెలియజేశారు. సింహాద్రి అప్పన్నకు శుభలేక అందించానని విరించారు అంతకు ముందు అర్చకులు వేద ఆశీర్వాదాన్ని అందించారు. ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ ప్రసాదాన్ని అందించారు.