3వ విడత చందన అరగదీత ప్రారంభం..
Ens Balu
3
Simhachalam
2021-06-17 06:14:04
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి సమర్పించే మూడో విడత చందనం అరగదీత ప్రక్రియ గురువారం సంప్రదాయంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొని స్వామివారి కోసం గందాన్ని అరగదీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీన జ్యేష్ట పూర్ణిమ సందర్బంగా స్వామివారికి మూడో విడత చందన సమర్పణ చేయనున్నారు. ఈనేపథ్యంలో చందనం చెక్కల అరగదీతను ఉద్యోగులు మొదలుపెట్టారు. బేడామండపంలో ఏర్పాటు చేసిన సానల ( రాళ్లు ) పై నాలుగు రోజుల పాటు ఉద్యోగులు చెక్కలను అరగదీసి పచ్చి గంధాన్ని తీస్తారు. రోజువారీ తీసిన గంధాన్ని తూకం వేసి అర్చకులు స్వాధీనం చేసుకుంటారు. వాటిని స్వామివారి భండాగారం భద్రపరిచిన గంధంలో సుగంధ ద్రవ్యాలను కలిపి జ్యేష్ట పున్నమినాడు స్వామివారికి సమర్పణ చేస్తారు. చందన సమర్పణలో భాగస్వాములు కావాలనుకునే భక్తులు అరకిలోకి రూ.10,116 , కిలోకి 20,116 సమర్పించుకో వచ్చునని అధికారులు ప్రకటించారు. అరకిలో చందన సమర్పణ చేసినవారికి 200 గ్రాముల చందనం చెక్క, కేజీ సమర్పించినవారికి 300 గ్రాముల చందనం ముక్కతోపాటు శేష వస్త్రం ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. చందన సమర్పణకు ఆన్ లైన్లో సొమ్ము చెల్లించాక చిరునామా, గోత్రనామాలతో పాటు వివరాలను స్క్రీన్ షాట్ తీసి 6303800736 వాట్సప్ నంబర్ కు పంపించాలని తెలిపారు.