చెట్ల వ్యర్ధాలు ఎక్కడా కనిపించ కూడదు..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-06-17 12:52:54

మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని ఎక్కడా చెట్ల వ్యర్ధాలు కనిపించకూడదని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం  నాలుగవ జోన్ లోని 34వ వార్డు పరిధిలో కొబ్బరితోట, అచ్చయమ్మపేట  ప్రాంతాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో  ఏపీఈపీడీసీఎల్ వారు విద్యుత్ వైర్ లకు ఆటంకం కలిగిన చెట్ల యొక్క కొమ్మలను తొలగించి  ఆ ప్రదేశంలోనే వదిలేస్తున్నారని వాటిని వారిచే ఆ వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు ప్రధాన కాలువలలోని చెత్తను తొలగించి, వాటి పలకలను వెంటవెంటనే మూసివేయాలని, డోర్ టు డోర్  చెత్తను సేకరించాలని, తడి-పొడి చెత్తను  వేరు వేరుగా తీసుకోవాలని, రోడ్లను సకాలంలో శుభ్రపరచాలని, డంపర్ బిన్ల వద్ద ఉన్న చెత్తను వెంటవెంటనే డంపింగ్ యార్డ్ తరలించాలని, డంపర్ బిన్ల చుట్టూ బ్లీచింగ్ జల్లించాలని, శానిటరి  అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా కాలువల్లో ఫాగ్గింగ్ చేయించాలని ప్రధాని వైద్యాధికారులను ఆదేశించారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారంలో ఒక రోజు “డ్రై” డే పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వెటర్నరి డాక్టర్ కిషోర్ ను ఆదేశించారు.  ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ ఫణిరాం, వెటర్నరి డాక్టర్ కిషోర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు గణేష్ బాబు, చిరంజీవి, శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.