కరోనా వైరస్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న తరుణంలో మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారులు చెప్పడానికే శ్రీరంగ నీతులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో కరోనా కేసులు తగ్గమంటే ఎలాతగ్గుతాయో జీవిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజనతో పాటు గురువారం సీఎంహెచ్ఓ జోనల్ కమిషనర్ ఫణిరాం, వెటర్నరి డాక్టర్ కిషోర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు గణేష్ బాబు, చిరంజీవి, శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజినీర్లు కనీసం ఒక మీటరు సామాజిక దూరం కూడా పాటించకుండా చేస్తున్న పర్యటనలపై విమర్శలు పెల్లుభికేలా చేశాయి. ఈ వార్తలోని ఫోటో చూస్తే మీకే అర్ధమవుతుంది కరోనా నిబంధన ప్రకారం ఏ స్థాయిలో భౌతిక దూరం పాటించేస్తున్నారో.. ఆదివారం చికెన్, మటన్ దుకాణాల దగ్గర జనం భారీగా గుమికూడటం వలన కోరానా వైరస్ వ్యాప్తి అధికంగా వస్తుందని ప్రచారం చేసిన కమిషనర్ నేరుగా అధికారులను అదే స్థాయిలో వెంటబెట్టుకొని ప్రజా క్షేత్రంలో తిరగడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. అసలే కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నా వైరస్ ప్రజలను వెంటాడుతున్న సమయంలో ప్రజలను కరోనా వైరస్ పై చైతన్యం తీసుకు రావాల్సిన అధికారులే ఈ విధంగా పర్యటనలు చేయడం విమర్శలకు తావిస్తుంది. సాధారణ జనం తిరిగితే..వారు చికెన్ షాపుల వద్దకు వెళితే కరోనా కేసులు వస్తాయన్న అధికారులు..అదే గుంపులు గుంపులుగా కమిషనర్ తో సహా దగ్గర దగ్గరగా తిరిగితే రావా అనే వాదన బలంగా వినిపిస్తుంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో జివిఎంసీ అధికారులే ఈ విధంగా గుంపులు గుంపులుగా తిరడంపై నగర ప్రజలు నవ్విపోతున్నారు. మీడియా ద్వారా కరోనా వైరస్ కోసం గొప్పలు చెప్పే అధికారులు ఉదయం వార్డుల్లోకి పర్యటకు వచ్చే సమయంలో ఒక్క అధికారి కూడా సామాజి దూరంగానీ, పరిశుభ్రత గానీ పాటించలేదనే విమర్శలు విశాఖలో హాట్ టాపిక్ గా మారాయి. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అధికారులు అత్యంత దగ్గరగా కలిసి వెళుతుండటం నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో సామాజిక దూరం పాటించే అధికారులు బాహ్య ప్రపంచంలో మాత్రం వాటిని గాలికొదిలేస్తున్నారనడానికి కమిషనర్ వార్డుల పర్యటనలే ప్రధాన సాక్షిగా కనిపిస్తున్నాయి. బహుసా జివిఎంసీ అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వం నిర్ధేశించిన కరోనా నిబంధనలు పాటించకూడదనే ప్రత్యేక ఉత్తర్వులు ఉన్నాయో..లేదంటే అంత దగ్గరగా భౌతిక దూరం పాటించకుండా తిరిగా వారికి కరోనా వైరస్ సోకదేమో సాధారణ ప్రజలకు సోకినంత త్వరగా..!