ఆక్వారైతులు మోసపోకూడదు..
Ens Balu
2
Srikakulam
2021-06-17 13:28:32
ఆక్వా రైతులు మోసపోకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లాఠకర్ మత్య్స శాఖ జెడి ని ఆదేశించారు. గురువారం జిల్లా స్థాయి చేపలు, రొయ్యల చెరువుల స్క్రూటిని అమలు చేయు కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ హాలులో జెసి సుమిత్ కుమార్ తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి నీటి చేపలు పెంచే ప్రాంతాలను మరింత పెంచే విధంగా రైతులకు అవగాహన పరచాలని తెలిపారు. మత్స్యకారులకు అవసరమైన యాంత్రీకరణ పరికరాలు ఉన్నాయా లేదా అని జెడి అడుగగా మెటీరియల్ సరఫరా చేసేందుకు డీలర్లు ఉన్నట్లు జెడి వివరించారు. జిల్లాలో కోస్టల్ ప్రాంతం ఎక్కువగా ఉన్నందు వలన మత్య్స కారులకు అవసరమైన పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేప పిల్లల పెంచేందుకు ఆక్వా రైతులకు అధికంగా సరఫరా చేయాలని సూచించారు. ఇంకా ఏమి చేస్తే బాగుంటుందని రైతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పంపిణీ చేస్తున్న చేపల ఆహారం నాణ్యమైనదిగా ఉందో లేదో పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు. చేపలు, రొయ్యలకు తరచు ల్యాబ్ లో పరీక్షలు చేస్తూ ఉండాలని ఆదేశించారు. చేపలు, రొయ్యలు చెరువుల కోసం రైతులు సచివాలయాలు ద్వారా ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో చేపలు, రొయ్యలు చెరువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన వాటిని జిల్లా స్థాయి కమిటీ లో 107 చెరువులకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీపతి, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, ఇరిగేషన్ డిఇ, మత్య్స శాఖ అధికారులు, మత్య్స కార రైతులు, తదితరులు పాల్గొన్నారు.