పశుసంవర్ధక శాఖ జెడిగా కిషోర్..


Ens Balu
3
Srikakulam
2021-06-17 13:35:20

శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులుగా  డాక్టర్ ఎం.కిషోర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ కిశోర్ విశాఖపట్నంలో వీర్య ఉత్పత్తి కేంద్రంలో ఉపసంచాలకులు గా పని చేస్తూ పదోన్నతి పై శ్రీకాకుళం సంయుక్త సంచాలకులుగా వచ్చారు. అంతకుముందు విశాఖపట్నం జిల్లా పాడేరులో ఉప సంచాలకులుగా, జీల్లా లైవ్  స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పలు హోదాల్లో పనిచేశారు. ఇప్పటి వరకు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డా. ఏ.ఈశ్వరరావు నుండి జెడిగా బాధ్యతలు స్వీకరించారు.  సంయుక్త సంచాలకులు బాధ్యతలు స్వీకరించిన కిశోర్ కు ఉప సంచాలకులు ఈశ్వర రావు, సహాయ సంచాలకులు నారాయణ రావు ఇతర సిబ్బంది అభినందించారు.