జివిఎంసీకి దివీస్ మాస్కులు వితరణ..


Ens Balu
2
Visakhapatnam
2021-06-17 13:42:53

దివీస్ సంస్థ జివిఎంసికి 15వేల మాస్కులను వితరణ చేసింది. గురువారం కార్యాలయంలో అదనపు కమిషనర్  డా. వి. సన్యాసిరావు కు మాస్కులను వాటిని సంస్థ సిబ్బంది అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్  మాట్లాడుతూ, కరోనా సమయంలో పారిశుధ్య సిబ్బంది కోసం మాస్కులు  దివీస్ సంస్థ అందించడం అభినందనీయమన్నారు. ఇవేకాకుండా ఇంకా 5 వేల మాస్కులు త్వరలో అందజేస్తుందని తెలిపారని అన్నారు. మొత్తం 20వేలు మాస్కులు జివిఎంసికి అందిస్తుందని, ఈ మాస్కులను ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్ నకు అందిస్తామని అదనపు కమిషనర్ తెలిపారు. దివీస్  సంస్థ సి.ఎస్.ఆర్ ఫండ్స్ నుంచి నిధులు కేటాయించారని, గత పన్నెండు రోజుల నుండి 12 మందికి ఉపాధి కల్పించి వారికి ఈ మాస్కులను తయారు చేయించారని తెలిపారు. సంస్థ మేనేజర్ వై.యస్.కోటేశ్వరరావు, సి.ఎస్.ఆర్. మేనేజర్ డి సురేష్ కుమార్ కు మాస్కులు అందించినందుకు అదనపు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.  ఇదే స్ఫూర్తితో ఇంకా మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి ఫ్రంట్లైన్ వారియర్స్ వారికి చేదోడుగా నిలవాలని పిలుపునిచ్చారు.