పెండింగ్ బిల్లులు చెల్లింపు జరగాలి..
Ens Balu
4
Collector Office
2021-06-17 13:45:43
ఇండియన్ నేవి రాంబిల్లిలో చేపట్టిన ఎన్ ఎ ఒ బి ప్రాజెక్టు లో అర్హులైన నిర్వాసితులకు, ప్రభావితులకు పెండింగ్ లో ఉన్న చెల్లింపులను సత్వరమే పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాల రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశమందిరంలో నేవి, రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ ఎ ఒ బి ప్రాజెక్టుకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలపై సంబందిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి తక్షణమే నివేదికను సమర్పించాలని ఆదేశించారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన మేరకు అర్హులైన లబ్దిదారులెవరికైనా చెల్లింపులు పెండింగ్ లో ఉంటే సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేవి అధికారులు కెప్టెన్ ఆదినారాయణ, కెప్టెన్ టి.రాజశేఖర్, కెప్టెన్ ఎస్. శివకుమార్, ఆర్ డి ఓ లు సీతారామరావు, అనిత, ఇరిగేషన్ ఎస్ ఇ సూర్యకుమార్, ఎన్ ఎ ఒ బి , ఎస్ డి సి జోసెఫ్, , మత్స్యశాఖ జెడి లక్ష్మణరావు, రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల తహసిల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.