విశాఖ జిల్లాలో కోవిడ్ మూలంగా తల్లితండ్రులను కాని, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన బాలలకు మహిళాభివృద్ది, శిశు సంక్షేమశాఖ అండగా వుంటుంది జిల్లా బాలల సంరక్షణ అధికారి ఏ.సత్యనారాయణ తెలిపారు. జిల్లా మహిళాశిశు సంక్షేమ సంస్థ పి.డి. సీతామహాలక్ష్మి ఆదేశాల మేరకు అటువంటి బాలల గృహాలకు వెళ్లి పరామర్శించి వారికి భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు. మధురవాడలో గల 8మంది బాలల గృహాలకు వెళ్ళి పిల్లలు యొక్క బాగోగులలో సంస్థ పాలుపంచు కుంటుందని అనాథ పిల్లల యొక్క సంరక్షకులకు తెలియజేశామన్నారు. సిబ్బంది జేసుదాసు తది తరులతో కలసి వెళ్లి వారికి సాంఘికరక్షణ, అవసరమైన తోడ్పాటు అందిస్తామని చెప్పామన్నారు.