వేగంగా సంక్షేమ పథకాల అమలు..
Ens Balu
2
Ongole
2021-06-17 14:01:34
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారని రాష్ట్ర విద్యుత్, అటవీ శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు మండలం వలేటి వారి పాలేం గ్రామంలో భవన నిర్మాణ పక్షోత్సవాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ఈ నెల17 నుండి జులై 2 వ తేదీ వరకు గృహ నిర్మాణ పక్షోత్సవాలను ప్రభుత్వం నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భోరాసా కేంద్రాలు,విలేజీ హెల్త్ క్లినిక్స్ ,మహిళాపాల డైరీల భవనాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పనులు ఈ భవన నిర్మాణ పక్షోత్సవాల్లో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వలే టివారి పాలేం లో నిర్మిస్తున్న గ్రామ సచివాలయ ,రైతు భరోసా కేంద్రాలకు సిమెంట్ కాంక్రీట్ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ కృష్ణ వేణి, డి.పి.ఓ నారాయణ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్.ఇ కొండయ్య, గ్రామ సర్పంచ్ ఎన్. ఉషారాణి, వై.సి.పి.నాయుకులు చుoడూరి రవి, సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్ రావుతదితరులు పాల్గొన్నారు.