జిజిహెచ్ కి ఎస్బీఐ పిపిఈ కిట్ల వితరణ..


Ens Balu
1
Guntur
2021-06-18 12:19:10

కోవిడ్ నివారణకు  భారతీయ స్టేట్ బ్యాంక్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువ లేనిదని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా,రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ అన్నారు. శుక్రవారం గుంటూరు నగరం పాలెం భారతీయ స్టేట్ బ్యాంక్ జిల్లా రీజనల్ బ్యాంక్  ఆవరణలో కరోనా నియంత్రణ కోసం గుంటూరు సమగ్ర వైద్యశాలకు రూ.7 లక్షల విలువైన 1500 పిపిఈ కిట్లను  జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా,రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ చేతులు మీదుగా అందించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా,రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ కరోనా మహ్మమారిని ఎదుర్కొనేందుకు దాతల సహరం అవసరమని అన్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఎన్.జి.వొ, అధికారులు, స్వచ్చంద సంస్థలను కలిపి నోడల్ ఏజన్సీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సామాజిక సేవలలో  భాగంగా గుంటూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి కి నోడల్ ఏజన్సీ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి సాంఘీక సంక్షేశాఖ డిప్యూటి డైరెక్టర్ మధుసూదనరావు నేతృత్వంలో దాతలు అందించిన సాయాన్ని ప్రణాళికా బద్ధంగా అవసరమైన వారికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతనెల 20 న ఎస్.బి.ఐ ఫౌండేషన్ ద్వారా గతంలో రెడ్ క్రాస్ సొసైటి కి రూ.8 లక్షల వైద్య పరికరాలను అందించినట్లు  భారతీయ స్టేట్ బ్యాంక్ గుంటూరు రీజనల్ మేనేజర్ తారకేశ్వరరావు వెల్లడించారు. ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులంతా బ్యాంక్ లావాదేవిలను ఎస్.బి.ఐ  యోనో డిజిటల్  అప్లికేషన్ ద్వారా సేవలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటి డైరెక్టర్ మధుసూదనరావు, గుంటూరు సమగ్ర ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రభావతి, గుంటూరు ఎస్.బి.ఐ అమరావతి సర్కిల్ పరిపాలన కార్యాలయ ఛీప్ మేనేజర్ సత్యనారాయణ, ఎస్.బి.ఐ ప్రధాన శాఖ మేనేజర్ సుబ్రహ్మణ్యం, యూనియన్ సంఘ నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస చారి, ఫణి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు