కరోనాతో పోరాడే రోగుల ఆరోగ్య పరిరక్షణకు ‘గమన’ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ఉచింతగా అందజేయడం అభినందనీయమని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్ దినేష్ కుమార్ ఛాంబర్ లో తుళ్ళూరు మండలం, అనంతవరం గ్రామానికి చెందిన ‘గమన’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుమారు రూ. 5 లక్షల విలువ చేసే 9 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అప్పారావు, పుష్పరాజు, మధుబాబు, రమేష్ లను జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్ దినేష్ కుమార్ వారి దాతృత్వాన్ని అభినందించారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో కరోనాకు గురై ఇబ్బందులు పడుతున్న బాధితుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దాతల సహకారంతో వస్తున్న వైద్యపరికరాలను ఉపయోగించి రోగులకు అత్యవసర చికిత్సను అందించడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ‘గమన’ సంస్ధ ప్రతినిధులు ఇచ్చిన 9 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో కోవిడ్ బారినపడి వైద్య చికిత్సకు ఇబ్బంది పడుతున్న రోగులకు వినియోగించాలని కోరారు. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను 29 గ్రామాల పరిధిలోని పిహెచ్ సి లకు అందించాలని వైద్యాదికారులకు ఆదేశిస్తామన్నారు. ‘గమన’ సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ కోవిడ్ నిర్మూలనకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్ దినేష్ కుమార్ కు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్ మధుసూదనరావు, ‘గమన’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు అప్పారావు, ఉపాధ్యక్షులు పుష్పరాజు, సెక్రటరీ మధుబాబు, కో- ఆర్డినేటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.