బుద్ధపార్క్ ను తక్షణమే శుభ్రపరచండి..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-06-18 12:27:17

దసపల్లా బుద్ధపార్క్ కళాహీనంగా ఉందని, వెంటనే పార్కును శుభ్రం చేయించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. శుక్రవారం  నాలుగవ జోన్ 28 వ వార్డు పరిధిలోని జివిఎంసి సివిక్ ఎక్ష్నొరా దసపల్లా హిల్స్ బుద్ధ పార్క్, దసపల్లా హిల్స్ పరిసర ప్రాంతాలలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పార్క్  అనంతరం దసపల్లా హిల్స్ తదితర ప్రాంతాలలో నివాసిత ఇళ్ల నుండి డోర్ టు డోర్ చెత్త సేకరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించి, పారిశుద్ధ్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. చెత్త సేకరించిన వెంటనే డంపింగ్ యార్డ్ కు తరలించాలని, దసపల్లా హిల్స్ పరిసర ప్రాంతాలలో భవన నిర్మాణ వ్యర్ధాలను వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని, ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి వార్డు శానిటరి  కార్యదర్శి వీధులలో పర్యటించి, పారిశుద్ధ్య కార్మికులచే రోడ్లు, కాలువలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరూ యాప్రాన్ బ్లౌజులు, చేతి గ్లౌజులు, మాస్కులు ధరించి విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరి ఇన్స్పెక్టర్ మరియు వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.