నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను దశలవారీగా భర్తీ చేసేందుకు క్యాలెండర్ విడుదల చేస్తూ ఉద్యోగ నియమాకాల్లో నవశకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2021–22 సంవత్సరం జాబ్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ళ పాలనలో రాష్ట్రంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మొత్తం 6,03,756 భర్తీ చేయటం జరిగిందన్నారు. జాబ్ క్యాలెండర్ 2021–2022 ద్వారా జూలై నుంచి మార్చి 2022 వరకు వివిధ ప్రభుత్వ శాఖలలో 10,143 ఉద్యోగాలు నియమకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు జారీ చేసే నెల వివరాలు తెలియజేయటం జరిగిందన్నారు. అవినీతి, వివక్షతకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందని, ఇంటర్వూల విధానంకు పూర్తిగా స్వస్తి చెబుతూ అర్హులకు మాత్రమే ఉద్యోగాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయ్, పాల్గొన్నారు.