కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే కోవిడ్ టీకా తప్పక వేయించుకోవాలని పల్సస్ సిఈఓ డా. గేదెల శ్రీనుబాబు అన్నారు. శుక్రవారం విశాఖ క్యాంపప్ లో ఉద్యోగుల రక్షణార్ధం అందరికీ కోవిడ్ టీకాలు ఉచితంగా వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ సంస్థలోని 2వేల మంది ఉద్యోగులకూ కోవిడ్ టీకా అందిస్తున్నామన్నారు. తొలివిడతగా 500 మందికి అందించామన్నారు. ఉదోగుల ఆరోగ్య భద్రతే సంస్థకు ప్రధానమని చెన్నై, డిల్లీ , హైదరాబాద్ లోని తమ కంపెనీల్లో ఉద్యోగులందరికీ ఉచితంగానే వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ కరోనా కష్టకాలంలో వ్యాక్సినే శ్రీరామ రక్షగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.