విజయనగరం జిల్లాలో ఆదివారం మెగా వాక్సినేషన్ డ్రైవ్ జిల్లాలో చేపట్టనున్నట్టు జాయింట్ కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. 45 ఏళ్ల పైబడిన వారికి, 0-5 ఏళ్ల లోపు పిల్లలు గల తల్లులకు ఈ డ్రైవ్ లో వాక్సిన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 నుంచి రాత్రి వరకు జిల్లాలోని కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాలన్నింటి లో వాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. కోవిషీల్డ్ వాక్సిన్ ను వేస్తారని తెలిపారు. ఈ డ్రైవ్ లో సుమారు 50 నుంచి 60 వేల మందికి ఒకే రోజున వాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆయా వాక్సిన్ కేంద్రాలకు వెళ్లి వాక్సిన్ వేయించుకోవాలని జె.సి. సూచించారు.