3వ విడత నాడు-నేడు పూర్తిచేయాలి..


Ens Balu
2
Anantapur
2021-06-18 14:19:20

మనబడి నాడు-నేడు కింద చేపట్టిన మొదటి దశ పనులను జూన్ మూడో వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్సు హాలు నందు మనబడి నాడు-నేడు పనులపై జిల్లా  విద్యా, అనుబంధ రంగాల శాఖలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్వాంగసుందరంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులు పై ఉన్నదని ఆమె తెలిపారు. పది రకాల సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణం  పాఠశాలలలో ఉండే విధంగా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులను హెచ్చరించారు. తొలిదశ పాఠశాలల్లో  వివిధ పనులు రన్నింగ్ వాటర్ తో మరుగుదొడ్లు, విద్యుత్తు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, రక్షిత మంచి నీరు, విద్యార్థులకు, సిబ్బంది, ఫర్నిచర్, రిపేర్లు, గ్రీన్ చాక్ బోర్డులు, అదనపు గదులు తదితర పలు పనులపై సంబంధిత ఎస్ఈ పి ఆర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో, సంబంధిత ఇంజనీర్లతో ఆరా తీశారు. నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా    పది రకాల సౌకర్యాలను జిల్లాలోని మొదటి విడత  నాడు నేడు కార్యక్రమం ద్వారా చేపట్టి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యారంగాన్ని జిల్లాలో సంబంధిత అధికారులు కలిసికట్టుగా కృషి చేసి ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలని తెలిపారు.

జూలై నుంచి నాడు-నేడు రెండవ విడత పనులను చేపట్టాల్సి ఉంటుందని, అందువలన మొదటి దశలో అక్కడక్కడా మిగిలిపోయిన మైనర్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు క్రియాశీలకంగా పని చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతుల కల్పన చేయాలన్నారు. వాల్ పెయింటింగ్స్, డిజిటల్ తరగతులు, మంచి నీటి వసతి తదితర అంశాల్లో లోపాలు ఉండకూడదన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిరి, విద్యా శాఖపై డిఈవో శామ్యూల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ, ఇంజనీర్లు శివరాం ప్రసాద్, శివ కుమార్, ఎస్ ఈ పంచాయతీ రాజ్ శాఖ భాగ్యరాజ్, ఆర్ఐఓ నాయక్,  పాలిటెక్నిక్, ప్రభుత్వ ఐ టి ఐ, ప్రిన్సిపాల్ లు, తదితరులు పాల్గొన్నారు.