విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ప్రసాదం కొరత లేకుండా చేసేందుకు దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు. కోవిడ్ తరువాత ప్రసాద అమ్మకాలను ప్రారభించిన దేవస్థానం. వాటి సంఖ్యను రోజు రోజుకీ పెరగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా పెంచుతున్నారు. శుక్రవారం ఈ మేరకు లడ్డూ తయారీ పోటు కేంద్రాన్ని ఈఓ ఎంవీ సూర్యకళ సందర్శించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు శని, ఆదివారాల్లో అధికంగా వస్తారని అందరికీ ప్రసాదం అందుబాటులో ఉండే విధంగా సరిపడినన్ని లడ్డూలు తయారు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో లడ్డూ రుచి, వాసన, బరువు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చూడాలని పోటు సిబ్బంది ఆదేశించారు. లడ్డు తయారీ విధానాన్ని స్వంయగా పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈఓ రాఘవ కుమార్, ట్రస్ట్ బోర్డు సభ్యులు సూరిబాబు, దినేష్ రాజు తదితరులుల పాల్గొన్నారు.