ఆస్పత్రి నిర్మాణాలు వేగం పెంచాలి..
Ens Balu
4
సఖినేటిపల్లి
2021-06-18 15:07:36
అనుకున్న లక్ష్యం కంటే ముందుగా ఆసుపత్రి భవనాల నిర్మాణాలు పూర్తవ్వాలని బి.సి సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి రాజోలు నియోజకవర్గములోని సఖినేటిపల్లి మండలం యిదే గ్రామంలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామస్థాయిలో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందించాలనే లక్ష్యంతో నూతన ఆసుపత్రి భవనాలను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. వాటిని అధికారులు దగ్గరుండి త్వరగా నిర్మాణపనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. అదే దారిలో తిరిగి వస్తుండగా కాలువలో పేరుకుని పోయిన గుఱ్ఱపుడెక్క ని ఉపాధిహామీ పధకంలో పనులు ఎగ్జిక్యూట్ చేసి వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో వైద్యసిబ్బంది స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. రాజోలు సర్కిల్ యిదే స్పెక్టర్ దుర్గా శేఖర్ రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.