మహా విశాఖలో తుక్కు కాలుష్యం..
Ens Balu
4
Visakhapatnam
2021-06-19 02:47:40
మహావిశాఖను క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా ఉంచాలని, గెడ్డలు కాలువల్లో చెత్తవేయకూడదని ప్రతినిత్యం ప్రకటనలు ఊదరగొట్టే జివిఎంసి కమిషనర్ డా.స్రిజన సంస్థకే చెందిన కార్యాలయాలయాల్లోనే వాహనాల తుక్కు భారీగా పేరుకుపోతున్నా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. సంస్థకే చెందిన వెహికల్ గ్యారేజీ లోని చెత్తాచెదారాన్ని కాలువల్లోనే గ్యారేజీ సిబ్బంది వేస్తున్నా.. అత్యంత భారీ స్థాయిలో కాలుష్యానికి కారణమవుతున్నా పట్టించుకోకుండా పూర్తిగా పక్కన పెట్టాశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదేదో కావాలని అంటున్న మాట కాదు. నగరాభివ్రుద్ధికోసం అహర్నిసలు కష్టపడి పనిచేసే కమిషనర్ ను సంస్థలోని అధికారులు, సిబ్బందే తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పడానికి ఆధారాలతో అందిస్తున్న కధనమిది. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి చెందిన అధికార మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ఫోటో ఆధారాలతో సహా అందిస్తున్న కధనంలో నిజమెంతుందో లాసెన్స్ బే కాలనీలోవ ఉన్న ఈ జివిఎంసీ వాహనాల గ్యారేజీని సందర్శిస్తే ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. ఇక్కడ సంస్థకు చెందిన చాలా వాహనాలు తప్పుపట్టి పోయి ఉన్నాయి. వాటిని నిర్వీర్యం చేయడం గానీ, లేదంటే తుక్కు కింద అమ్మేయడం గానీ చేయకపోవడంతో ఈ గ్యారేజీలోని తుక్కపెద్ద ఎత్తున పేరుతకుపోతుంది. చాలా తప్పుపట్టిన చెత్తను పక్కనే వున్న పెద్ద డ్రైనేజీలో పడేస్తున్నారు ఇక్కడి సిబ్బంది. జివిఎంసీలో చెత్తను తరలించడానికి, కట్టడాల వ్యర్ధాలను తరలించడాని వినియోగించే వాహనాల కోసం ఇక్కడ గ్యారేజీని ఏర్పాటు చేశారు. అక్కడే వాహనాల రిపేరు, పట్టుబడిన వాహనాలను ఇక్కడ డంప్ చేస్తుంటారు ఈ తరుణంలో చాలా వాహనాలు తుప్పుపట్టి పోయాయి. అలా తుప్పపట్టిన వాహనాల్లో చాలా వాటికి పార్టులు కూడా మాయమయ్యాయని సమాచారం. వాటిని తప్పు లెక్కలో చూపించి కొత్తపార్టులు కొన్నట్టుగా జివిఎంసీ ఆధాయానికి కన్నం వేస్తున్నట్టుగా కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. జివిఎంసీలోవున్న చాలా విభాగాల్లో అత్యధికంగా ఖర్చుచేసే వాటిల్లో ఈ గ్యారేజి ఒకటి. మీడియా కూడా దీనిపై పెద్దగా ఫోకస్ పెట్టదు..అలా పెట్టిన మీడియాని జివిఎంసి అధికారులు, అక్కడి గ్యారేజీ సిబ్బంది ప్రశన్నం చేసుకొని వారి స్థాయిలో వారు ముడుపులు చెల్లించుకుంటారని కూడా తెలుస్తుంది. మామూళ్లు, ఖర్చులు, దొంగలెక్కలు పక్కనపెడితే ఈ గ్యారేజికి ఆనుకొని వున్న డ్రైనేజీ నేరుగా సముద్రంలోకి వెళుతుంది. ఇక్కడ వేసిన ఇనుప ముక్కలు, తప్పు తుక్కు నీటిలో కరగకుండా సముద్ర జాలాల్లోకి వెళ్లి ఆ ప్రాంతంలోని నీరు కూడా కలుషతం అవుతోంది. అసలు ఈ వెహికల్ గ్యారేజీ తుక్కును జివిఎంసి ఎందుకు పట్టించుకోవడం లేదు..ఎందుకు ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, దొంగలెక్కలు చూడటం లేదనే విషయాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే..తేడా వ్యవహారాల్లోని పర్శంటేజీలు అన్నీ ప్రధానకార్యాలయానికి వెళ్లకుండా ఉంటాయా అని చెబుతున్నారు..నగరాన్ని స్వచ్ఛంగా ఉంచాలని స్వచ్ఛభారత్ నిధులతో శుభ్రత పరిశుభ్రత చేస్తున్నట్టు నటిస్తున్న అధికారులు ఇలాంటి తుక్కు గ్యారేజీపైనా ద్రుష్టిసారిస్తే సంస్థ తరపున పెరుగుతున్న కాలుష్యం ఎంతో లెక్కతేలుతుంది. ఏ స్థాయిలో డ్రైనేజీలు కలుషితం అవుతున్నాయో గుర్తించవచ్చు. ఆ దిశగా చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాలి..!