నాడు- నేడు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఇక పై ప్రతి రోజు టార్గెట్ లను ఇచ్చి, సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తానని , పురోగతి కనపడక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం కలక్టరేట్ ఆడిటోరియం లో మున్సిపల్ కమీషనర్లు, ఎం.పి.డి.ఓ లు, ఎస్.ఈలు, ఈ ఈ లు ఎం.ఈ.ఓ ల తో జే.సి సమీక్షించారు. జిల్లాలో 1040 పాఠశాలలను నాడు-నేడు క్రింద ఎంపిక చేయగా 854 పాఠశాలల పనులు పురోగతి లో ఉన్నాయని, 323 పాఠశాలకు చెందిన అన్ని పనులు పూర్తి అయ్యాయని అన్నారు. 415 పాఠశాలల వాల్ పెయింటింగ్స్, 362 సివిల్ వర్క్స్ పూర్తి అయ్యాయని తెలిపారు. మండల విద్య శాఖ అధికారులు , ఆర్.డబ్లు.ఎస్ , ట్రైబల్ వెల్ఫేర్, పంచాయతి రాజ్ ఎ.పి.ఈ.డబ్లు.ఐ.డి.సి, సమగ్ర శిక్ష శాఖల ఇంజినీర్లు ప్రతి రోజు కనీసం 3 గంటల పాటు ఈ పనుల పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. పనులు చేయడమే కాకుండా ఖర్చు చేసిన బిల్లులను అప్ లోడ్ చెయ్యాలని, ఎం.బుక్ ను కూడా పక్కాగా నిర్వహించాలని సూచించారు. సిమెంట్, ఇతర సామాగ్రి, సాంకేతిక సమస్యలేమైనా తలెత్తితే వెంటనే జిల్లా విద్య శాఖ ను సంప్రదించాలని అన్నారు.
ఈ సమావేశం లో జిల్లా విద్య శాఖ అధికారి జి. నాగమణి, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ వెంకటేశ్వర రావు, సర్వ శిక్ష అభియాన్ ఎ.పి.సి విజయలక్ష్మి, మున్సిపల్ కమీషనర్లు, పంచాయతి రాజ్, ఆర్.డబ్లు.ఎస్. ఎస్.ఈ లు, ఈ ఈ లు, డి.ఈ లు, ఎం.పి.డి.ఓ లు, పాల్గొన్నారు.