70 వేల మందికి టీకా లక్ష్యం..


Ens Balu
3
Vizianagaram
2021-06-19 09:11:25

 కోవిడ్ థర్డ్ వేవ్ ను దృష్టి లో పెట్టుకొని ప్రజల వద్దకే వెళ్లి  టీకా వేసే కార్యక్రమాన్ని చేపడుతు న్నట్లు సంయుక్త కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.  అందుకోసం  ఈ ఆదివారం కోవిడ్ టీకా ప్రత్యెక డ్రైవ్ ను నిర్వహించనున్నామని, ఇప్పటికే  ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ప్రతి సచివాలయం లోను, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లోను ఈ టీకా వేయనున్నట్లు తెలిపారు.  శనివారం కలక్టరేట్  ఆడిటోరియం లో  ఎం.పి.డి.ఓ లు,  మున్సిపల్ కమీషనర్లతో ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో   45 యేళ్ళు నిండిన వారికీ, 5 సంత్సరాల లోపు పిల్లలు ఉన్న తల్లులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, వికలాంగులకు, స్వచ్చంద సంస్థల ప్రతినిదులకు టీకా వేయడం జరుగుతుందన్నారు.  ప్రతి గ్రామం లోను ముందు రోజే టామ్ టామ్ ద్వారా  అందరికీ తెలిసేలా  చూడాలన్నారు.  ఆశ, ఎ.ఎన్ఎం లను, సచివాలయ సిబ్బందిని విధులకు కేటాయించాలని సూచించారు.  సంబంధిత ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇప్పటికీ అర్హులైన వారి జాబితాలు సిద్ధంగా ఉన్నాయని,   కనీసం 70 వేల మందికి  ఈ డ్రైవ్ లో టీకా వేసేలా చూడాలని తెలిపారు.  మండల స్థాయి, గ్రామా స్థాయి అధికారులు సమిష్టి గా సమన్వయం తో పని చేయాలన్నారు.  వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,  నిరంతర పర్యేక్షణ లో టీకా కార్యక్రమం జరగాలని ఆదేశించారు. 
ఈ సమావేశం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  డా. ఎస్.వి.రమణ కుమారి,  వాక్సినేషన్ ఇంచార్జ్ డా. గోపాల కృష్ణ, ప్రత్యేకాది కారి డా. రమేష్,  జిల్లా పరిషత్ సి.ఈ.ఓ వెంకటేశ్వర రావు, మున్సిపల్ కమీషనర్లు,  ఎం.పి.డి.ఓ లు, పాల్గొన్నారు. 
సిఫార్సు