మహా విశాఖలో కోవిడ్ వేక్సిన్ డ్రైవ్..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-06-19 12:58:24

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల పరిధిలో ఆదివారం నిర్వహిస్తున్న కోవిడ్ వేక్సినేషన్ ప్రత్యేక “డ్రైవ్” ను విజయవంతం చేయాలని జివిఎంసి కమిషనర్  డా. జి. సృజన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర పరిధిలోని అన్ని సచివాలయాల్లో 45 సంవత్సరాలు దాటిన వారికి, 5 సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులకు, ఆదివారం ఆయా సచివాలయాల పరిధిలోనే ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ వేయుదురని కమిషనర్ తెలిపారు. ఏ సచివాలయాల పరిధిలో ఉన్నవారు, ఆయా సచివాలయంలోనే మొదటి, రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేసుకోవాలని తెలిపారు. వార్డు వాలంటరీల సహాయంతో సచివాలయం పరిధిలో పైన తెలిపిన విధంగా అర్హత కలిగిన వారందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని ఆదేశించారు. అందరు జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేక అధికారులు, ఆయా సచివాలయాల వ్యాక్సినేషన్ వేయు ప్రాంతంలో మౌళిక వసతులైన మంచినీరు, టెంట్స్, కుర్చీలు, విద్యుత్ శ్చక్తి మొదలైనవి ఏర్పాటుచేయాలని, వ్యాక్సినేషన్ వేయించుకొనుటకు వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కమిషనర్ ఆదేశించారు. ఆదివారం ప్రత్యేక “డ్రైవ్” ద్వారా ఒక లక్ష వ్యాక్సినేషన్లు వేయించాలని ప్రభుత్వం టార్గెట్ గా నిర్ణయించిందని,  అందుకు అందరూ సంసిద్ధులు కావాలని కమిషనర్ కోరారు. కావున, సచివాలయ పరిధిలో అర్హత కలిగిన వ్యక్తులు ఈ అవకాశం వినియోగించుకొని వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.