అప్పన్నకు మంత్రి అవంతి పూజలు..


Ens Balu
3
Simhachalam
2021-06-19 13:40:03

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు శనివారం  దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అవంతి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వామివారి క్రుపతో కరోనా వైరస్ సమసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా పంచగ్రామాల సమస్యలను పరిష్కరించడాని ప్రభుత్వం అన్నివిధాల క్రుషి చేస్తుందని చెప్పారు.. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు.  ఈఓ మంత్రి కి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టుబోర్టు సభ్యులు, సూరిబాబు, దినేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.