కోవిడ్ వేక్సినేషన్ లక్ష్యం చేరుకోవాలి..


Ens Balu
3
Collector Office
2021-06-19 14:06:14

విశాఖ జిల్లాలో ఆదివారం నిర్వహించే కోవిడ్ వేక్సినేషన్ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఈ మేరకు కలెక్టరేట్ లో  జాయింట్‌ కలక్టరు-2,  జివిఎంసీ కమిషనరు, ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్,  జిల్లా ఇమ్యూనైజెషన్  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ,  ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఆదివారం జి.వి.ఎం సి పరిధిలో ప్రత్యేక టీకా ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు.  జివిఎంసి పరిధిలోని (33 పి హెచ్ సి ల పరిధిలో గల ) 578 వార్డు సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేసినట్టు కమిషనర్ వివరించారు.  45 సంవత్సరముల దాటిన వారికి 1 మరియు 2వ  డోస్, అదేవిధంగా 0-5 వయస్సు పిల్లలుగల (45 సంవత్సరముల లోపు ) తల్లులకు ఒకటవ డోస్  వేయాలన్నారు. అర్హులైనవారందకీ వేక్సిన్ వేయించేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డా .సావిత్రి,  ఎడిషనల్ డైరక్టర్, వైద్య ఆరోగ్య శాఖ, డా. జీవన్‌ రాణి, జిల్లా ఇమ్యూనైజెషన్ అధికారిణి,  ఆంధ్రా మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్  డా.పివి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

సిఫార్సు