సోమవారం నుంచి ఆర్.టి.ఓ సేవలు..


Ens Balu
3
Vizianagaram
2021-06-19 15:15:40

విజయనగరం జిల్లాలో కోవిడ్ కారణంగా కొద్ది రోజులుగా నిలిపి వేసిన ప్రాంతీయ రవాణా కార్యాలయం ద్వారా పౌర సేవలను జూన్ 21వ తేదీ సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఉప రవాణా కమిషనర్ సిహేచ్. శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు శనివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు  డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ, ఎల్.ఎల్.ఆర్., వాహనాల ఫిట్ నెస్ కు, రవాణా శాఖ కు సంబందించిన అన్ని సేవలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందిస్తామని పేర్కొన్నారు.  ప్రజలు సోమవారం నుంచి అన్ని సేవలను పొందవచ్చని తెలిపారు.