ఆన్ లైన్ సేవలపై పండితులకు శిక్షణ..


Ens Balu
3
Simhachalam
2021-06-19 15:37:32

 శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి ఆర్జిత సేవలు ఆన్ లైన్ లో అందించే విషయమై వేదపండితులకు అవగాహన ఉండాలని ఈఓ ఎంవీ సూర్యకళ సూచించారు. శనివారం దేవస్థానంలోని వేదపండితులు, ఆలయ సిబ్బందికి  TMS.AP.GOV.IN వెబ్ సైట్, యూట్యూబ్ ద్వారా అందించేసే సేవలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, చాలామంది భక్తులు శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి ఆర్జిత సేవల్లో పరోక్షంగా పాల్గొంటున్నారని అన్నారు. సింహాచలం దేవస్థానం ఈఓ అకౌంట్ కు రుసుము చెల్లించి సైతం భక్తులు పరోక్ష సేవల్లో భాగస్వాములవుతున్నారు. TMS వెబ్ సైట్లో సింహాచలం దేవస్థానంకు సంబంధించి పరోక్ష సేవలు, ఈ హుండి, డొనేషన్ ఆప్షన్లున్నాయని వాటి వినియోగంపై అవగాహన పెంచుకోవడం ద్వారా  భక్తులకు తెలియజేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ సందర్భంగా TMS వెబ్ సైట్ ద్వారా ఏఈఓ రణమమూర్తి నిత్యకళ్యాణం, ఏఈఓ తిరుమలేశ్వరరావు నిత్యకళ్యాణంకి టికెట్లు బుక్ చేసుకున్నారు. సీసీ వరాలరావు  తన ఆరోగ్యం బావుండాలన్న ఉద్దేశతో రూ.1116 స్వామివారికి విరాళం , బంగారు రాజు గోరక్షణ పథకానికి డొనేషన్ ఇచ్చారు.  ఆన్ లైన్ సేవలు, ఈ హుండీ, డొనేషన్ల గురించి అందరికీ అర్థమయ్యేలా ఈఓ  సూర్యకళ, బంగారు రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో  గోపాలకృష్ణమాచార్యులు, శ్రీనివాస ఆచార్యులు, సీతామారాచార్యులు సహా పలువురు వేద పండితులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ సుజాత,  ఏఈఓలు రాఘవ కుమార్, తిరుమలేశ్వరారవు , రమణమూర్తి, శ్రీనివాస్, ఆనంద కుమార్,ఇంజనీరింగ్ సహా అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.