డాక్టర్లు తో చర్చలు ఫలప్రదం..


Ens Balu
3
Tirupati
2021-06-19 15:41:56

తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్  రెసిడెంట్ డాక్టర్లు గత మూడు రోజులుగా స్టయిఫండ్  కోసం నిర్వహిస్తున్న  చర్చకు దానికి అనుకూలంగా  ఈరోజు సాయంత్రం  శ్రీ పద్మావతి  అతిధి  గృహమునందు  తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి  జవహర్  రెడ్డి తో   స్విమ్స్  రెసిడెంట్ డాక్టర్స్ స్టైఫండ్ పెంపుదల విషయంపై జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఈ చర్చలలో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ, స్విమ్స్ డైరెక్టర్, ఉప కులపతి డాక్టర్.బి.వెంగమ్మ, స్విమ్స్ డీన్, స్విమ్స్ రిజిస్ట్రార్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి  మరియు స్విమ్స్  రెసిడెంట్ డాక్టర్లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా స్విమ్స్ రెసిడెంట్ డాక్టర్లు తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి , స్విమ్స్  యాజమాన్యానికి  కృతజ్ఞతలు తెలియజేశారు.
సిఫార్సు