అనంతలో ఇసుక కొరత రాకూడదు..


Ens Balu
1
Anantapur
2021-06-19 16:01:14

ఇసుక కొరత లేకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం సాయంత్రం జిల్లా ఇసుక కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించగా, ఇందులో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ రెవెన్యూ, రైతు భరోసా) నిశాంత్ కుమార్, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) సంక్షేమం గంగాధర్ గౌడ్, ఏ ఎస్పి సెజ్ రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గత సమీక్షా సమావేశంలో జరిగిన అంశాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారంలోగా హిందూపురం, బ్రహ్మసముద్రం మండలం గోవిందయ్య దొడ్డి రీచ్ లను ప్రారంభించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా కదిరి, గుంతకల్, రాయదుర్గం, అనంతపురం డిపోలలో తగినంత ఇసుక నిల్వలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జెపి ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. భూగర్భ శాఖ నుండి కొత్తగా పర్యావరణ అనుమతులు పొందిన 10 ఇసుక రీచ్ లకు మ్యాన్యువల్ నుంచి యంత్రాలతో తవ్వకాలు కొరకు మోడిఫికేషన్ అనుమతులు వెబ్ సైట్ లో నమోదు చేయాలని ఆదేశించారు. కొత్తగా ఇసుక రీచ్లలో సంయుక్తంగా లైన్ డిపార్ట్మెంట్లు తనిఖీలు నిర్వహించి జిల్లా కమిటీకి ఆమోదం కొరకు సమర్పించాలన్నారు. బుధవారం లోగా కొత్తగా తనిఖీ చేసిన రీచ్ ల ఆమోదం కొరకు నివేదిక సమర్పించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ వారి పనులకు సంబంధించి వాహనాల జాబితాను సమర్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డిడి మెన్స్ ఎస్ వి రమణ రావు, సాండ్ ఆఫీసర్ కొండారెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ ఈ భాగ్యరాజ్, జెపి ఏజెన్సీ మేనేజర్ దయాళన్, నోడల్ ఆఫీసర్ నాగరాజ్, తాడిపత్రి ఏడి మైన్స్ ఆదినారాయణ, విజిలెన్స్ ఏడి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు