నాడు-నేడుతో పాఠశాలలకు మహర్ధశ..


Ens Balu
3
Anantapur
2021-06-19 16:12:29

నాడు నేడుతో పాఠశాలల  రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతోందని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభిరుద్ది పనులు చేపట్టిన రాజేంద్ర మున్సిపల్ హైస్కూలు,కస్తూరి హైస్కూలు,వాల్మీకి మున్సిపల్ ప్రైమరీ స్కూల్ లను శనివారం అధికారులతో కలసి పరిశీలించారు. 18 పాఠశాలల్లో మనబడి నాడు నేడు కింద తొమ్మిది రకాల పనులు త్రాగునీటి  సదుపాయం,టాయిలెట్స్,మేజర్ మరియు మైనర్ రిపేర్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ ఫర్నిచర్స్ ,గ్రీన్ చాక్ బోర్డు,కాంపౌండ్ వాల్,పెయింటింగ్ వర్క్స్ ,ఇంగ్లీష్ ల్యాబ్ వంటి పనులు చేపట్టినట్లు అధికారులు మేయర్ కు వివరించారు. ఇందులో కస్తూరిబాయ్ మున్సిపల్ హై స్కూల్ లో రూ.58 లక్షలు,వాల్మీకి ప్రైమరీ స్కూల్ లో రూ.17 లక్షలు,రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ లో రూ.57 లక్షలు ఖర్చు చేసి ఆయా పాఠశాలల్లో అభిరుద్ది పనులు చేసినట్లు మేయర్ వసీం కు వివరించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ కు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించడం గొప్ప కార్యక్రమం అన్నారు.నగరంలో ప్రజలకు ప్రభుత్వ  విద్య,వైద్యం  మెరుగైన  సేవలు అందించేందుకు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కొన్ని పాఠశాలల్లో వాటర్ ప్లాంట్ లు దుమ్ము దూళి నిండి ఉండటంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి పనులు చేపట్టినా నిర్వహణ లేకుంటే త్వరగా పాడేయ్యే అవకాశం ఉందని ఉపాద్యాయులు వాటి నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు దేవి,  లక్ష్మీదేవి, సాకే చంద్రలేఖ,లీలావతి, కమలభూషణ్,టీవీ చంద్రమోహన్ రెడ్డి, ఇషాక్,అనీల్ కుమార్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ షాంశుద్దిన్, డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి ఎస్ సి రమేష్ చంద్ర, ఈ ఈలు రామ్మోహన్రెడ్డి, ఆదినారాయణ, అసిస్టెంట్ ఇంజనీర్లు నాగజ్యోతి, శంకర్, వైఎస్ఆర్సిపి నాయకులు ఖాజా, కుల్లాయి స్వామి మహబూబ్ పీరా, , లక్ష్మన్న గంగాధర్, స్కూళ్లలో హెడ్ మాస్టర్స్  తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు