3వ దశ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం..


Ens Balu
4
Tirupati
2021-06-20 10:07:14

రాష్ట్రంలో కోవిడ్19 కేసులు గణనీయంగా తగ్గి 24 వేల నుంచి 5 నుండి 6 వేలకు నమోదు స్థాయికి వచ్చిందని హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. కె.సింఘాల్ చెప్పారు. ఆదివారం ఉదయం తిరుపతి నగరం లోని నెహ్రూ నగర్ , ప్రకాశంపార్కు వద్ద వున్న పట్టణ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలో పర్యటించి వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ , నగరపాలక కమిషనర్ గిరీషా కలసి  హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటించి వ్యాక్సినేషన్ పరిశీలించి, వైద్య అధికారులతో, వాక్సిన్ వేసుకున్న వారితో మాట్లాడారు. వాక్సిన్ వేసుకున్న పెద్దవయస్సు వున్న వారు  రవిరాజు, మొలకయ్య వాక్సిన్ ఏర్పాట్ల ప్రక్రియ అద్భుతంగా వుందని, ఎలాంటి ఇబ్బందులేదని, మాకు గాని మాకుంటుంబాలకు గాని కోవిడ సోకలేదని, కోవిడ నిబంధనలు పాటిస్తున్నామని  హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అడిగిన దానికి సమాదానం ఇవ్వగా, ప్రిన్సిపల్ సెక్రటరీ  సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీడియా కు వివరిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో ఐసియు , ఆక్సిజన్ బెడ్లు పెంచామని, రాబోవు రోజుల్లో ఆగస్టు నాటికి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా  ఏర్పాట్లు చేస్తున్నమని, 100 బెడ్లు ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ల ఏర్పాటుకు రూ.350 కోట్లతో టెండర్లు కూడా పిలిచామని తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ తో  పాటు ప్రత్యన్మయం ఆక్సిజన్ కాన్సంటెటర్లు అందుబాటులో వుంచానున్నామని  తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో  యాక్టివ్ కేసులు 65 వేలకు వచ్చాయని అన్నారు. వాక్సినేషన్ అందించడంలో ఇప్పటికే 96,69,000 లక్షల మందికి మొదటి డోసు  పూర్తిచేశామని, గతంలో ఒక్కరోజు లో 6,29,000 డోసులు వేసి సామర్థ్యం చూపామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారని , వారంలో 3 రోజులు కోవిడ్ పై సమీక్ష నిర్వహిస్తున్నారని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి రెండు రోజుల క్రితం 9 లక్షల డోసులు కేటాయించడంతో నేడు ఆదివారం 45 సంవత్సరాల పైబడిన వారికి , 5 సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు , విదేశాలకు వెళ్లనున్న స్టూడెంట్స్ కు  డ్రైవ్ మోడ్ తో చేపట్టితే మద్యాహనానికి 5,30,000 పూర్తి అయ్యాయని, సాయంత్రం 100 శాతం పూర్తి అవుతుందని తెలిపారు. నిర్దేశించిన వయస్సు వారు 85 శాతం పూర్తి అయిందని, మిగిలినవారికి  కూడా పూర్తిచేస్తామని తెలిపారు. , మూడవ వేవ్ వల్ల అత్యంత ప్రమాదం లేదని నిపుణులు చెపుతున్నా.. రాకూడదనే కోరుకుందామని..ఒక వేళ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దంగా వున్నామని వివరించారు.

మీడియా ప్రతినిధులు అడిగిన వాటికి సమాధానంగా మూడవ వేవ్ లో పిల్లలకు ఇప్పుడు కన్నా ఎక్కువ ప్రమాదం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపిన విషయం తెలిసిందేనని, మూడవ వేవ్ రాకూడదనే కోరుకున్నా, వచ్చినా ఎదుర్కొనడానికి సిద్దంగా వున్నామని, రాష్ట్ర స్థాయి కమిటీ వేశామని, ఇందులో పిడియాట్రిక్ సీనియర్  వైద్యులు సభ్యులు వున్నారని,   అందుకు కావలసిన వైద్య మందులు, బెడ్లు, ఆక్సిజన్ వంటివి అందుబాటులో వుంచుతున్నామని, చిన్నపిల్లల చికిత్స కోసం వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కోవిడ్ చికిత్సకు రెమిడిసివర్, బ్లాక్ ఫంగస్ కు ఎంఫోటెరిసిస్-బి వంటివి అందుబాటులో వున్నాయని, వీటి ఆలస్యానికి కారణం అందులో వాడే మందులు విదేశాలనుండి రావడం, కేంద్రం సూచనల మేరకు కేటాయింపు వంటివి వుంటాయని వివరించారు. ప్రస్తుతం ఇబ్బంది లేదని 770 మందికి  బ్లాక్ ఫంగస్ చికిత్స  అందించామని తెలిపారు. 

జిల్లా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో నేడు 1,05,000 డోసులను నిర్దేశించామని 100 శాతం పూర్తి అవుతుందని, ఇందులో నియోజక వర్గ నోడల్ అధికారులు, మెడికల్ సిబ్బంది, రెవెన్యూ , పంచాయితీ రాజ్ సిబ్బంది కాంపైన మోడ్ లో చేస్తున్నారని మద్యాహనానికి 55 శాతం మేర పూర్తి అయిందని వివరించారు. నగరపాలక కమిషనర్ వివరిస్తూ తిరుపతిలో వార్డు సచివాలయాల్లో, అర్బన్ హెల్త్ సెంటర్లలో 34 చోట్ల వాక్సినేషన్ ప్రక్రియ ఏర్పాటు చేశామని 6 వేల డోసులు లక్ష్యంగా వేస్తున్నామని, వ్యాక్సిన్ వేసే సమయంలో ఇబ్బంది కలిగితే ఆంబులెన్సులు సిద్దంగా వుంచామని, ఇంతవరకు ఇబ్బంది లేదని తెలిపారు. హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారి పర్యటనలో  డి.ఎం.హెచ్.ఓ, శ్రీహరి, తిరుపతి ఆర్డీవో కనక నరసా రెడ్డి, రుయా సూపర్నెంట్ భారతి  మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ సుధారాణి, హెల్త్ సెంటర్ డాక్టర్లు ప్రియాంక , ప్రవీణ తదితరులు వున్నారు.