కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ మర్గం..


Ens Balu
3
Anantapur
2021-06-20 11:03:52

కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ శాశ్వత పరిష్కారమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం నగరంలోని రెండవ రోడ్డులో ఉన్న 64వ వార్డు సచివాలయంలో కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి, నగర మేయర్ మహమ్మద్ వసీం సలీంలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 22 లక్షలమందికిపైగా వ్యాక్సినేషన్ వేసినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా జిల్లాలో 6 లక్షల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు 8 నుంచి 10 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 90 వేల మందికి వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోందని, ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగా కరోనా కూడా తగ్గుముఖం పట్టిందని, సోమవారం నుంచి కర్ఫ్యూ నిబంధనలు కూడా సడలిస్తోందన్నారు. అయితే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని మాస్కులు ధరించాలని సూచించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఆదివారం ఉదయం నుంచి చేపట్టినట్లు, జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా జరుగుతోందని తెలిపారు. జిల్లాకు కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 90 వేల మందికి వాక్సినేషన్ చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఇందుకు సంబంధించి జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈరోజు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ముఖ్యంగా తల్లులకు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సినేషన్ వేసేలా లక్ష్యం నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే 45 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ చేపట్టాలని తెలియజేయడం జరిగిందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు, వాలంటీర్లను భాగస్వామ్యం చేసి వ్యాక్సినేషన్ పట్ల ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని, జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం మాట్లాడుతూ చిన్న పిల్లలు ఉన్న తల్లులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడం గొప్ప కార్యక్రమమన్నారు. తమ పిల్లల ఆరోగ్యం కోసం తల్లులు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరికీ వ్యాక్సినేషన్ వేయాలన్నదే సిఎం జగనన్న సంకల్పమన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటికే మూడో వేవ్ వచ్చినా తట్టుకునేందుకు ఏర్పాట్లు చేయడం జగనన్న ముందు చూపుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్  పివివిఎస్ మూర్తి, కార్పొరేటర్లు శాంతి సుధా, చంద్రమోహన్ రెడ్డి, దాదా ఖలందర్, రాధాకృష్ణ, హెల్త్ సెక్రెటరీ మహేశ్వరి, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.