అజ్ఞాత భక్తుడి విరాళం రూ.2.8లక్షలు..
Ens Balu
2
Simhachalam
2021-06-20 12:08:10
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి అజ్ఞాత భక్తుడు(వ్యాపారవేత్త) ఆదివారం రూ.2,08,116( రెండు లక్షల ఎనిమిమిదివేల నూట పదహారు రూపాయలు) విరాళం సమర్పించారు. ఈ మొత్తాన్ని ఈఓ పేరుతో చెక్కును పీఆర్వో కౌంటర్ లో అందజేశారు. దాత మాట్లాడుతూ, ఎంతో దూరం నుంచి స్వామి చూసేందుకు భక్తులు వస్తారని అలాంటి వారికి స్వామివారి ప్రసాదం అందించే శ్రీ సింహాద్రినాథుని నిత్యాన్నదానం పథకానికి ఈ మొత్తం వెచ్చించాలని ఆ భక్తుడు కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ భక్తుడికి ఈఓ ఎంవీ సూర్యకళ స్వామివారి ప్రసాదాలను అందజేశారు.