సింహాద్రి అప్పన్నకు రూ.లక్ష విరాళం..
Ens Balu
2
Simhachalam
2021-06-20 12:18:55
సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి ఆదివారం విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన సింహాద్రి హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని స్వామివారికి రూ.1,00,000 విరాళం అందించారు. నిత్యన్నదాన పథకానికి ఆ మొత్తాన్ని వినియోగించాలని కోరారు. తనకొచ్చే లాభాల్లో ఒకశాతం స్వామివారికి విరాళమివ్వడం ఆనవాయితీగా పాటిస్తున్నానని దాత తెలియజేశారు. ఈ మొత్తం యొక్క చెక్ ను పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల కౌంటర్ లో అందించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలను తీసుకోవడంతో పాటు వేద పండితుల ఆశీర్వచనాన్ని కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.