రేపటి నుంచి అప్పన్న అన్నప్రసాదం..
Ens Balu
3
Simhachalam
2021-06-20 12:26:23
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి దర్శనార్ధం వచ్చే భక్తులకు అన్నప్రసాదాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ మేరకు ఆమె ఆలయంలో మీడియాతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఈ ప్రసాదాన్ని ప్యాకెట్ల రూపంలో అందించనున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలను అనుసరించి స్వామివారి దర్శనాలు ఉదయం 6.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ కల్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. భక్తులందరూ కోవిడ్ ప్రొటోకాల్ విధిగా పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని ఈఓ కోరారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలను ఇప్పటికే ప్రారంభించి భక్తులకు అందిస్తున్నట్టు ఈఓ చెప్పారు.