అప్పన్న ఆలయంలో ప్రత్యక్ష సేవలు..
Ens Balu
3
Simhachalam
2021-06-20 12:35:54
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం నుంచి ప్రత్యక్షసేవలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు సడలించడంతో స్వామిని నేరుగా దర్శించుకుని సేవల్లో పాల్గొనే వారికి అవకాశం కల్పించినట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. కళ్యాణోత్సవం, గరుడసేవ, అష్టోత్తర పూజలు ప్రత్యక్షంగా నిర్వహించామన్నారు. వీటితో పాటు నేరుగా సేవల్లో పాల్గొనలేనివారు ఆన్ లైన్ ద్వారా కూడా పాల్గొన్నారని చెప్పారు. టిఎంఎస్ వెబ్ సైట్ ద్వారాగానీ దేవస్థానం ఈఓ కార్యాలయ అకౌంట్ కు గానీ ఆన్ లైన్ ద్వారా నగదు చెల్లించి కూడా పరోక్ష సేవల్లో పాల్గొనవచ్చునని ఈఓ వివరించారు.