వేక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కి విశేష స్పందన..
Ens Balu
3
విశాఖ సిటీ
2021-06-20 13:19:34
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 572 సచివాలయాల పరిధిలో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కు మంచి స్పందన వచ్చిందని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. ఈ మేరకు ఆదివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 45 సంవత్సరాలు పైబడిన వారు, 5 సంవత్సరాలు లోపు పిల్లల ఉన్న తల్లులు వ్యాక్సినేషన్ వేయించుకునేందు కోవిడ్ నిబంధనలు పాటించి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జివిఎంసి ఏరియాలో ఒక లక్ష వ్యాక్సినేషన్ వేయాలని టార్గెట్ ఇచ్చిందని, దానిని అధిగమించి అన్ని సచివాలయాల పరిధిలో ఒక లక్షా పదివేల మందికి వ్యాక్సినేషన్ వేయించామన్నారు. ఇందుకు జివిఎంసి ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, డాక్టర్లు, నర్సులు, వార్డు ప్రత్యేక అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఎంతో కృషిచేసి స్పెషల్ డ్రైవ్ ను విజయవంతం చేశారని వారందరికీ కమిషనర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.