డ్రైవర్ల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం..
Ens Balu
4
Srikakulam
2021-06-20 13:31:09
శ్రీకాకుళం జిల్లాలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అర్.టి.సి డివిజనల్ మేనేజర్ జి.వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆదివారం మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. అర్.టి.సి డ్రైవింగ్ స్కూల్ లో హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్లుగా ఇప్పటి వరకు రెండు బ్యాచ్ ల లో నైపుణ్యం తో కూడిన శిక్షణ కార్యక్రమం ఇవ్వటం జరిగిందన్నారు. మూడవ బ్యాచ్ శిక్షణ ప్రారంభం కానుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఎల్.ఏం.వీ లైసెన్స్ ,హెవీ ఎల్.ఎల్.ఆర్, ఆధార్ కార్డుతో డివిజనల్ మేనేజర్ కార్యాలయం,ఎ.పి.యస్.ఆర్.టి.సి. కాంప్లెక్స్ శ్రీకాకుళంలో ధరఖాస్తు చేసుకోవాలని డివిజనల్ మేనేజర్ కోరారు. ఫీజు, ఇతర వివరాలకు 7382921920, 9441161051 నంబర్లకు సంప్రదించ వచ్చని ఆమె పేర్కన్నారు.