కలెక్టర్ కార్తికేయ మిశ్రా కీర్తిపతాక..
Ens Balu
4
West Godavari
2021-06-20 16:42:48
కార్తికేయ మిశ్రా ఈ పేరు వినగానే గుర్తొచ్చేది అందరికీ అయితే ఒక ఐఏఎస్ అధికారి అనే..కానీ ఈయన కార్యదీక్ష, విధినిర్వహణ, లక్ష్యాలు చేరుకునే సంఖ్య మాత్రం ఎప్పుడూ మొదటి స్థానమనే విషయం కేవలం ప్రభుత్వ అధికారులకు మాత్రమే తెలుసు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ వేక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రకటించగానే పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలోనే టీకా పంపిణీలో ముందుండాలని ఆదేశించడంతో పాటు అమలుచేసిన చూపిన డైనమిక్ కలెక్టర్ గా రాష్ట్రప్రభుత్వం సాధించిన ప్రగతిలో అగ్రభాగంలో నిలిచారు.. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కోవిడ్ వేక్సినేషన్ ఉదయం 8గంటలకు ప్రారంభిస్తే రాత్రి తొమ్మిది గంటలకు తొలిస్థానంలో నిలిచి లక్షా 60 వేల 822 మందికి కోవిడ్ వేక్సిన్ అందించి టాప్ వన్ స్థానంలో నిలిచారు. దీనితో మరోసారి పశ్చిమగోదావరిజిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా మరోసారి వార్తొల్లోకి ఎక్కారు. కాగా తూర్పుగోదావరి 154754 తో రెండో స్థానంలో ఉండగా, క్రిష్ణాజిల్లా 3వ స్థానంలో 139980, విశాఖపట్నం 111726 నాల్గవ స్థానం, 5వ స్థానంలో గుంటూరు 106435, 6వ స్థానంలో చిత్తూరు 101291లో ఉండగా, 7వ స్థానంలో ప్రకాశం 99898, 8వ స్థానంలో శ్రీకాకుళం 85816, 9వ స్థానంలో అనంతపురం 86008, 10వ స్థానంలో నెల్లూరు 79016, 11వ స్థానంలో కర్నూలు 78655, 12వ స్థానంలో డా.వైఎస్సార్ కడప 76743,13వ స్థానం మరియు ఆఖరి స్థానంలో విజయనగరం 61160లో నిలిచింది.