రక్షమంత్రి మాజీ సైనికుల సంక్షేమ నిధి కేంద్రీయ సైనిక బోర్డు న్యూఢిల్లీ మాజీ సైనికుల పిల్లలకు విధ్యా విషయక గ్రాంట్ - 2020-21 కి ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిన్నట్టు జిల్లా సైనిక సంక్షేమ అధికారి బి. సత్యారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హవల్దార్ ర్యాంకు వరకు ఉన్నవారు మాత్రమే అర్హులని తెలిపారు. WWW.KSB.GOV.IN అను వెబ్ సైట్ (WELFARE-SCHEMES-RMEWF-EDUCATION GRANT-APPLICATION-FORM)లో రిజిష్టర్ చేసుకొని దరఖాస్తు పూర్తిగా ఆన్ లైన్ లో సమర్పించాల్సిందిగా ఆ ప్రకటనలో కోరారు. ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తును ప్రింట్ చేసి సంబంధిత దృవ పత్రములు, ఫీజు రశీదులను జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం, శ్రీకాకుళంలో అందజేయాల్సిందిగా ఆయన ఆ ప్రకటనలో కోరారు. 1వ తరగతి నుండి 9వ తరగతి, 11వ తరగతులకు దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తే 30.09.2021 దీ, 10వ తరగతి, 12వ తరగతులకు తే 31.10.2021 దీ, డిగ్రీ కోర్సు విద్యార్థులకు తే 30.11.2021 దీ లలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసిన తరువాత దరఖాస్తు దారుని వ్యక్తిగత పర్యవేక్షణలో ఉన్నందున ఈ కార్యక్రమ ప్రక్రియలో దరఖాస్తు దారులు బాధ్యత చూపుకోవలసిందిగా ఆయన ఆ ప్రకటనలో కోరారు.