వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో వేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ యొక్క వ్యర్ధాలు(ప్రమాదకరమైన చెత్త)ను డంపింగు యార్డుకు తరలించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటరి ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఐదవ జోన్, 59వ వార్డు లోని శ్రీహరిపురం, ఎఫ్.ఆర్.యు. సెంటర్ ను సందర్శించి ఆదివారం స్పెషల్ డ్రైవ్ లో వేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ యొక్క వ్యర్ధాలను ఎం.ఎస్.ఎఫ్.ల ద్వారా సేకరించి కాపులుప్పడ డంపింగు యార్డుకు తరలించాలన్నారు. అనంతరం కొత్త గాజువాక, పాత గాజువాక జంక్షన్, మింది తదితర ప్రాంతాలలో పర్యటించి డంపర్ బిన్స్ లో ఉన్న చెత్తను తరలించాలని, పలు చోట్ల కాలువలలో చెత్తను శుభ్రం చేయక పోవడంపై ఆయా శానిటరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ సంస్థల ఖాళీ స్థలాలలో చెత్త పేరుకు పోయిందని, వాటిని వారి చేతనే తొలగించేందుకు తగు చర్యలు చేపట్టాలని, వారు చెత్తను తొలగించని యెడల మన కార్మీకులచే చెత్తను తొలగించి, వారి వద్ద నుండి అపరాధ రుసుంను వసూలు చేయాలని శానిటరి అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 59వ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్, శ్రీహరిపురం ఎఫ్.ఆర్.యు. సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.