యడ్లవల్లి ల్యాండ్ పై చర్యలు తీసుకోవాలి..
Ens Balu
4
Guntur
2021-06-21 13:19:36
చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో ఉన్న యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ పునరుద్ధరణకు సంబంధించి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి తో కలసి యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ పునరుద్ధరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ పునరుద్ధరించాలని ఆదేశించిన నేపథ్యంలో సోసైటీ సభ్యులను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సోసైటీ సభ్యుల గుర్తింపు కోసం జూన్ 23వ తేదీ గ్రామ సభ నిర్వహించాలని, 25 తేదీ న సొసైటి సభ్యుల డ్రాఫ్ట్ లిస్ట్ ప్రచురించాలని, జూన్ 25 నుంచి 28వ తేదీ వరకు ప్రచురించిన సభ్యుల డ్రాఫ్ట్ లిస్ట్పై అభ్యంతరాలు స్వీకరించాలని, జూన్ 29వ తేదీ అభ్యంతరాలు పరిష్కరించి సాయంత్రం 5 గంటలకు యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ సభ్యుల పైనల్ లిస్ట్ను ప్రచురించాలన్నారు. యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సోసైటీ సభ్యుల గుర్తింపు ప్రక్రియను సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ), సంయుక్త కలెక్టర్ (అసరా, సంక్షేమం) తో పాటు డీఆర్డీఏ పీడీ, జిల్లా సహకారా అధికారి, సోషల్ వేల్ఫేర్ డీడీ, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ లు సభ్యులుగా ఉన్న ప్రత్యేక బృందం పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి రాజశేఖర్, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదనరావు, మైనింగ్ ఏడీ విష్ణువర్థన్ రావు పాల్గొన్నారు.