వైఎస్సార్ కాలనీల్లో మౌళిక సదుపాయాలు..


Ens Balu
2
Kakinada
2021-06-21 13:22:07

నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు సంబంధించి సిద్ధం చేసిన లేఔవుట్లలో  మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి,  జిల్లాలో గృహ నిర్మాణాలు వేగవంతం చెయ్యాలని  జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)ఎ.భార్గవ్ తేజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ జాయింట్ కలెక్టర్ గా ఎ.భార్గవ్ తేజ్ బాధ్యతలు స్వీకరించినక తొలిసారిగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో  జిల్లాలో నవరత్నాలు -పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి లేఔవుట్ల ప్రస్తుత పరిస్థితి,  గృహనిర్మాణలు, ఇతర అంశాలపై గృహ నిర్మాణ శాఖ, గ్రౌండ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, పంచాయితీరాజ్ , జిల్లా గ్రామీణ అభివృద్ధి, డ్వామ,ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు . ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ్ మాట్లాడుతూ వైయస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో తొలి దశలో 825 లేఔవుట్లలో 1లక్ష 48వేల 526 గృహా నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. లేఔవుట్ల వారిగా నోడల్ అధికారిని కేటాయించి  గ్రౌండింగ్ వివరాలు ఎప్పటికప్పుడు అందించాలన్నారు. ప్రతి లేఔవుట్లలో త్రాగునీరు, ఎలక్ట్రిఫీకేషన్, ఇతర మౌలిక సదుపాయాల కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.లేఔవుట్లులో పెండింగ్ లో ఉన్న మట్టిని నింపడం, లెవలింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు డివిజన్, మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సమిష్టి బాధ్యతతో గృహ నిర్మాణ పనుల్లో పురోగతి చూపించాలని జేసి అధికారులకు సూచించారు.

    ఈ సమీక్షా సమావేశంలో జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట అధికారి జి.వీరేశ్వర ప్రసాద్, జడ్పీ సీఈఓ ఎన్ వివి.సత్యనారాయణ, డిపివో ఎస్ వి.నాగేశ్వర నాయక్, డిఆర్డిఏ పిడి వై.హరిహరనాథ్,మెప్మా పిడి  కె.శ్రీరమణి, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ సూపరింటెడెంట్ ఇంజనీర్లు టీ.గాయత్రీ దేవి,బిఎస్. రవీంద్ర, డ్వామా పిడి ఎ.వెంకటలక్ష్మి, ఏపీఈపిడిసిఎల్ ఎస్ఇ నరసింహారావు, ఇతర అధికారులు హాజరైయారు.