ఆసరా ఫౌండేషన్ సాయం మరువలేనిది..


Ens Balu
2
GVMC office
2021-06-21 13:30:18

కరోనా వైరస్ సమయంలో ప్రజలకు వైద్యసేవలందించేందుకు ఆసరా ఫౌండేషన్ ముందుకొచ్చి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించడం నిజంగా అభినందనీయమని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన పేర్కొన్నారు. సోమవారం జివిఎంసికి 50 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లు ఆసరా ఫౌండేషన్  ఉచితంగా అందించింది. కోవిడ్ బారిన పడిన రోగులకు ఆక్షిజన్ అందించాలనే సంకల్పంతో రూ.56 లక్షల విలువైన 50 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లను ఆసరా ఫౌండేషన్ ప్రతినిధులు  జివిఎంసి కమిషనర్ ను  ఆమె ఛాంబార్లో కలసి అందించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ,ముడసర్లోవ కోవిడ్ సెంటర్లో కోవిడ్ రోగులకు చేసిన సేవలకు ముగ్దులై వీటిని అందింస్తున్నామన్నారు. వీటిలో 40 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లను ముడసర్లోవ కోవిడ్ సెంటర్ నకు, 10 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లను జివిఎంసి పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించామని కమిషనర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి కోవిడ్ నియంత్రణకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసరా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రెసిడెంట్ రామారావు, జాయింట్ సెక్రటరి వినయ్ మొదలైన వారు పాల్గొనగా జివిఎంసి నుండి అదనపు కమిషనర్ డా. వి.సన్యాసి రావు, ముడసర్లోవ కోవిడ్ కేర్ సెంటర్ నోడల్ అధికారి డా. కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు