గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన సోసైటీ భూములను సోమవారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. భూముల విస్తీర్ణం మ్యాపులను, అడంగల్, ఆర్ఎస్ఆర్లో ఉన్న భూముల స్వభావం వివరాలను, అనుభవదారుల వివరాలకు సంబందించి రెవెన్యూ రికార్డులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించి, రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఇన్చార్జి ఆర్డీవో పార్ధసారధి, చిలకలూరిపేట ఇన్చార్జి తహశీల్దారు మల్లిఖార్జునరావు, జిల్లా సహకార అధికారి రాజశేఖర్, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదనరావు, మైనింగ్ ఏడీ విష్ణువర్థన రావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.