జూలై 10న జిల్లాలో లోక్ అదాలత్..
Ens Balu
3
Vizianagaram
2021-06-21 13:49:11
జాతీయ లీగల్ సెల్ అథారిటీ ఆదేశాల మేరకు, జులై 10న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ ఛైర్మెన్ గుత్తల గోపి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల 26న జరగాల్సిన వర్చువల్ లోక్ అదాలత్‌ను రద్దు చేయడం జరిగిందని, దానికి బదులుగా 10 న జాతీయ లోక్ అదాలత్‌లో కలిపి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అదాలత్ ద్వారా వివిధ రకాల సివిల్, క్రిమినల్ కేసులు, భూ తగాదాలు, ఎక్స్సైజ్, విద్యుత్ , ఫ్యామిలీ, బ్యాంకులకు సంబంధించిన కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా కు సంబంధించిన కేసులను ఇరు పక్షాల అంగీకారంతో, రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చునని సూచించారు. ఈ అదాలత్ లో తమతో పాటుగా, సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి లక్ష్మీరాజ్యం కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి కోరారు.