జిల్లా కలెక్టర్ ను కలిసిన సబ్ కలెక్టర్..


Ens Balu
3
Kakinada
2021-06-21 13:57:50

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా నియమించిన  రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలక్కియా సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇలక్కియా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)డా జి. లక్ష్మీ శ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)కీర్తి చేకూరిని  కలిసి పుష్పగుచ్ఛం అందించారు. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన రాజమహేంద్రవరం డివిజన్ సబ్ కలెక్టర్ గా సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అన్ని డివిజన్ వాసులందరికీ సక్రమంగా అందే విధంగా తన వంతు కృషి చేస్తానని  ఆమె ఈ సందర్భంగా తెలిపారు.