వై.ఎస్.ఆర్ చేయూత పధకం కింద రెండవ సంవత్సరం 1,93,231 మంది లబ్దిదారులకు రూ.4234.05కోట్లు పంపిణి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 45–60 సంవత్సరాల మధ్య గల ఎస్.సి, ఎస్.టి, బి.సి, మరియు మైనారిటీ సామాజిక వర్గాలలో ఉన్న మహిళలకు ఆర్ధికంగా అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వై.ఎస్.ఆర్ చేయూత పధకంను ప్రారంబించడం జరిగిందన్నారు. ఈ పధకం కింద అర్హులైన లబ్దిదారురాలుకు సంవత్సరానికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్ధిక సాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ సంవత్సరం అందించే ఆర్ధిక సాయాన్ని ఈ నెల 22 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానం ద్వారా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తారన్నారు. వై.ఎస్.ఆర్ చేయూత పధకం కింద రెండవ సంవత్సరం 1,93,231మంది లబ్దిదారులకు రూ.4234.05 కోట్లు లబ్ది .. గిరిజన కార్పొరేషన్ ద్వారా 8,485 మంచి లబ్ధిదారులు, బీసీ కార్పొరేషన్ ద్వారా 1,24,782 మంది లబ్ధిదారులు. క్రిస్టియన్ మరియు మైనార్టీ కార్పొరేషన్ 179 మంది లబ్ధిదారులు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 23,462 లబ్ధిదారులు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 36,323 మంది లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగిందని పైప్రకటనలో తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.