ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి లక్షమాస్కులు..
Ens Balu
0
Guntur
2021-06-21 14:55:24
గుంటూరు జిల్లాలో కోవిడ్–19 ఫ్రంట్లైన్ వర్కర్స్ కోసం హైదరాబాదులోని మెస్సర్స్ ఎఫ్సీఎన్ ఇమ్పెక్స్ ఇండియా ఎల్ఎల్పి సంస్థ లక్ష మాస్కులు వితరణ చేసినట్టు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలియజేశారు. ఈ సందర్భగా సంస్థ పంపిన లక్ష మాస్క్లను సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు ఏవీ పటేల్, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు వి గోపి క్రిష్ణ స్వయంగా వాటిని కలెక్టర్ కి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా సమయంలో దాతలు ఎంతో ఉదారంగా స్పందిస్తున్నారన్నారు. మరింత మంది దాతలు ముందుకి రావడం ద్వారా కరోనా సోకిన నిరుపేద ప్రజలకు, ఫ్రంట్ లైన్ వర్కర్లుకు మరింత సాయం అందించడానికి వీలుపడుతుందని చెప్పారు.