మత్స్యకార భరోసా మంజూరులో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపలపై విచారణకు ఆదేశించామని మంత్రి అప్పల రాజు తెలిపారు. మంగళవారం మత్స్యకార భరోసా ఆరోపణలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సోంపేటతోపాటు కొన్ని మండలాల్లో వస్తున్న ఆరోపణలపై విచారణకు ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడవ విడత మత్స్యకార భరోసాగా 1.19 లక్షల మందికి రూ.10 వేలు చొప్పున విడుదల చేసామని అందులో సాంకేతిక కారణాల వలన దాదాపు 23 వేల మంది ఖాతాల్లో జమ కాలేదని వివరించారు. అవగాహన లేకుండా పలువురు ఆరోపణలు చేయడం జరుగుతుందని మంత్ర పేర్కొంటూ జగన్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కాగా ఇప్పటికే మూడు సార్లు రైతు భరోసా అందించిన ఘనత దక్కిందన్నారు. వేట నిషేధ కాలం తరువాత నిర్ధేశిత కాలంలో భరోసా మొత్తాన్ని అందిస్తున్నామని మంత్రి అన్నారు. రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఎవరూ తప్పు పట్టే పరిస్ధితి లేదని ఆయన పేర్కొన్నారు.